భద్రకాళి అమ్మవారిని సందర్శించిన ప్రముఖులు

WGL: వరంగల్ భద్రకాళి దేవాలయానికి శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం వీపీ గౌతం, ఐఏఎస్ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించారు. అనంతరం జైళ్ల శాఖ ఐజీ మురళీబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరిని ఆలయ ధర్మకర్తలు, అర్చకులు శేషు ఘనస్వాగతం పలికారు. పూజానంతరం మహదాశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు.