'కొత్త పోలమ్మ పండగ సామరస్యంగా జరపాలి'

'కొత్త పోలమ్మ పండగ సామరస్యంగా జరపాలి'

PPM: కొత్తవలస శ్రీ కొత్త పోలమ్మ ఉత్సవాలను శాంతి, సామరస్యాలతో నిర్వహించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సూచించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించారు. నందమూరి కాలనీకి ఘటాల అంశంపై స్థానికులతో మాట్లాడి పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. పండగ సమయంలో భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్‌లను ఆదేశించారు