శిథిలావస్థకు చేరిన ఎంపీడీవో కార్యాలయం

శిథిలావస్థకు చేరిన ఎంపీడీవో కార్యాలయం

NLR: బుచ్చి మండల ప్రజా పరిషత్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. కార్యాలయంలోని పలు గదుల్లో స్లాబు పెచ్చులు ఊడడం లేకుండా గోడలు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయి. వివిధ సమస్యల పరిష్కారం కోసం నిత్యం గ్రామాల నుంచి వచ్చే ప్రజలు భవనం ఎప్పుడు కూలుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనంలోకి మార్చాలన్నారు.