మంచినీరు బోరు పనులను పరిశీలించిన ఎంపీటీసీలు

మంచినీరు బోరు పనులను పరిశీలించిన ఎంపీటీసీలు

ELR: ఉంగుటూరు(M) నారాయణపురం ఎస్సీ స్మశాన వాటికలో జరుగుతున్న మంచి నీరు బోరు పనులను ఎంపీటీసీ సభ్యులు బండారు నాగరాజు, అరివెల్లి మహాలక్ష్మి దానయ్య గురువారం పరిశీలించారు. ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి కృషితో మండల పరిషత్ నిధులతో ఈ మంచినీరు బోరు పనులు పూర్తవుతున్నాయన్నారు. నిధులు మంజూరు చేసిన ఎంపీపీ శ్రీలక్ష్మికి ఎంపీటీసీలు కృతజ్ఞతలు తెలిపారు.