అంతర్రాష్ట్ర వాహన దొంగ అరెస్ట్
NZB: భీమ్‌గల్ పోలీసుల తనిఖీల్లో అంతర్రాష్ట్ర వాహన దొంగ పట్టుబడ్డాడు. HYDకు చెందిన అతనిపై గతంలో 14 కేసులు ఉన్నాయి. ఆర్మూర్‌లో బైక్, భీమ్‌గల్‌లో ఆటో దొంగిలించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. బైక్, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.