కొండగట్టులో ఆర్జిత సేవల రుసుం పెంపు వాయిదా
TG: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఆర్జిత సేవల రుసుం పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు EO శ్రీకాంతరావు తెలిపారు. ఆర్జిత సేవల టికెట్ ధర పెంచడంతో భక్తులపై భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమైంది. ఆలయంలో వసతులు అంతంతమాత్రంగానే ఉండగా సేవా రుసుం పెంచడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవల రుసుం పెంపు నిర్ణయాన్ని వాయిదా వేశారు.