కనిగిరిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై దాడులు

కనిగిరిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై దాడులు

ప్రకాశం: కనిగిరి పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు నిల్వ ఉంచినా, పంపిణీ చేసినా కఠిన చర్యలు తప్పవు అని మున్సిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఇందులో భాగంగా మంగళవారం పట్టణంలోని పలు షాపులను తనిఖీలు నిర్వహించారు. ఓ షాపులో 20 కిలోల ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని రూ.10,000 జరిమానా వసూలు చేశారు. అనంతరం ప్లాస్టిక్ కవర్లు వాడొద్దన్నారు.