‘రాధాకృష్ణన్ ప్రోటోకాల్ పక్కనపెట్టి గిరిజనులతో గడిపారు’

‘రాధాకృష్ణన్ ప్రోటోకాల్ పక్కనపెట్టి గిరిజనులతో గడిపారు’

రాజ్యసభలో సీపీ రాధాకృష్ణన్‌పై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ప్రోటోకాల్ పక్కనపెట్టి, హెలికాప్టర్ లేకపోయినా చిన్న వాహనాల్లో గిరిజన గూడేలకు వెళ్లారని గుర్తుచేశారు. పదవి అహంకారం లేకుండా సామాన్యుడిలా ప్రజల్లో తిరిగారని, ఆ విషయాన్ని జార్ఖండ్ సీఎం కూడా గర్వంగా చెప్పేవారని మోదీ కొనియాడారు. మీ సేవాభావం అందరికీ ఆదర్శం అని అన్నారు.