'యూరియాపై కేంద్రం మొండి వైఖరి వీడాలి'

'యూరియాపై కేంద్రం మొండి వైఖరి వీడాలి'

KNR: శంకరపట్నం మండల కేంద్రంలో CPM మండల కమిటీ సమావేశం కే.దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా నాయకులు ముకుంద రెడ్డి, వెల్మరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి యూరియా అందించడంలో విఫలమైందన్నారు. సొసైటీలలో ఆందోళనలు, పోరాటాలతో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ప్రయోజనం లేదని చెప్పారు.