VIDEO: అంగరంగ వైభవంగా గోదా–రంగనాథ స్వామి కళ్యాణం
WGL: రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం గోదా–రంగనాథ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనంతో పునీతులయ్యారు.