వన్డేల్లో 'టాప్-2' బ్యాటర్లుగా 'రో-కో'
విరాట్ కోహ్లీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో కోహ్లీ 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో టాప్ రన్ స్కోరర్‌గా(302*) నిలవడంతో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని.. రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, 2021 తర్వాత కోహ్లీ వన్డేల్లో ఇప్పటివరకు అగ్రస్థానానికి చేరుకోలేదు.