బాల్యవివాహాల నిరోధంపై సమావేశం
పెద్దపెల్లి జిల్లా బండారికుంట అంగన్వాడీ కేంద్రంలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం బాల్యవివాహాల నిరోధంపై సమావేశం జరిగింది. కోఆర్డినేటర్ అరుణ, జెండర్ స్పెషలిస్ట్ సుచరిత బాల్య వివాహాలు నేరమని, 18 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లు ఆరోగ్య-సామాజిక సమస్యలకు దారితీస్తాయని తెలిపారు. పాల్గొన్న మహిళలకు ప్రతిజ్ఞ చేయించి హెల్ప్‌లైన్ నంబర్లు అందించారు.