రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని తప్పించబోయే క్రమంలో కూలీల ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.