ఒకే రోజు మూడు దొంగతనాలు

NTR: నందిగామ డివిజన్ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. నందిగామ నెహ్రు నగర్‌లో శుక్రవారం మూడు ఇళ్లల్లో చోరీ జరిగింది. మునిరెడ్డి ఇంట్లో 29 గ్రాముల బంగారం, రూ.30వేల నగదు అపహరించారు. నగల బాలచారి ఇంట్లో 17 గ్రాముల బంగారం, రూ.8వేల నగదు చోరీ చేశారు. ఈ విషయంపై నందిగామ పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు.