చర్చనీయాంశంగా ప్రకాశ్ రాజ్ ట్వీట్

నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ఓ ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. 'ఒక చిలిపి సందేహం.. మహాప్రభు.. తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక, మాజీ సీఎం కానీ ప్రస్తుత సీఎం కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, మీ మాట వినే 'ఉపముఖ్యమంత్రి'ని సీఎంని చేసే కుట్ర ఏమైనా ఉందా ?' అని ప్రశ్నించారు. అయితే పరోక్షంగా పవన్ కళ్యాణ్ గురించే ఈ ట్వీట్ చేశారంటూ నెట్టింట పలువురు అభిప్రాయపడుతున్నారు.