కోర్టు పరీక్షలు రద్దు: ప్రధాన న్యాయమూర్తి
కర్నూలు: రికార్డ్ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ పోస్టులకు ఫిబ్రవరి 18న నిర్వహించిన రాత పరీక్షలను హైకోర్టు ఆదేశాల మేరకు రద్దు చేసినట్లు కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి బుధవారం తెలిపారు. త్వరలో మళ్లీ రాత పరీక్షల తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. వివరాలను జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు.