VIDEO: CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
GNTR: ముఖ్యమంత్రి సహాయనిధి ఆపన్నులకు అభయహస్తం అని ఎమ్మెల్యే గళ్ళా మాధవీ అభివర్ణించారు. శ్రీనివాసరావు పేటలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు CMRF చెక్కులను మాధవి అందజేశారు. మొత్తం 41 మంది లబ్ధిదారులకు రూ. 32లక్షలు అందజేయడం జరిగిందని చెప్పారు. నియోజకవర్గంలో ప్రజల అభ్యున్నతి, సంక్షేమమే తన ధ్యేయమని అన్నారు.