VIDEO: సత్తుపల్లి ఆఫీసర్స్ క్లబ్‌లో అగ్నిప్రమాదం
KMM: సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పాత ఆఫీసర్స్ క్లబ్ భవనంలో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా ఉన్న ఈ భవనంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.