రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీ
BPT: బాపట్ల మండలంలోని గుడిపూడి నుంచి యేట్రవారిపాలెం వెళ్లే రహదారి శంకుస్థాపన కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని భూమి పూజ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి దిశగా రహదారి నిర్మాణం ఎంతో కీలకమని ఆయన తెలిపారు.