VIDEO: సోమశిలలో 50 TMCలకు చేరిన నీటిమట్టం

NLR: సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వస్తోంది. ఈక్రమంలో డ్యాంలో 50.550 TMCల నీటిమట్టం నమోదైంది. 28,161 క్యూసెక్కుల కృష్ణా జలాలు వస్తుండగా.. రైతుల అవసరాల కోసం పవర్ టన్నెల్ ద్వారా పెన్నా డెల్టాకు 1,850, కండలేరుకు 8,600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. సోమశిలలో భారీ స్థాయిలో నీటి నిల్వలు ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.