లాల్ సింగ్ తండా ఉప సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
KMM: కూసుమంచి మండలం, లాల్ సింగ్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం అయింది. ఈ మేరకు ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్‌గా గుగులోతు వసంతను పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వసంతను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఆమె అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మధు పాల్గొన్నారు.