కుక్కలు దాడి.. 30 గొర్రె పిల్లలు మృతి

GDWL: వడ్డేపల్లి మండలం వెంకట్రామ నగర్ గ్రామానికి చెందిన కుర్వ కిష్టన్నకు చెందిన గొర్రె పిల్లలను రక్షణగా ఇనుపకంచెలో పెట్టి గొర్రెల మందను మేపడానికి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి కంచెలో ఉన్న గొర్రె పిల్లలపై శనివారం కుక్కలు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో సుమారు 30 గొర్రె పిల్లలు మృతి చెందాయని కుర్వ కిష్టన్న తెలిపారు.