రాధాకృష్ణుని సన్నిధిలో మంత్రి సవిత

సత్యసాయి: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తాడేపల్లిలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో రాధాకృష్ణులకు శనివారం మంత్రి సవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవితకు అర్చకులు, ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. రాధాకృష్ణుడిని దర్శించుకున్న అనంతరం మంత్రి సవితకు అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు.