'2032 నాటికి దేశంలో 12 కోట్ల ఈవీలు'

'2032 నాటికి దేశంలో 12 కోట్ల ఈవీలు'

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్, కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ విడుదల చేసిన ఓ నివేదికలో 2032 నాటికి భారత్‌లో 12.3 కోట్ల వాహనాలు ఉంటాయని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 76 వేల పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2032 నాటికి 21 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని సమాచారం.