VIDEO: ఏనుగుల దాడి.. మహిళ మృతి
CTR: కుప్పం సరిహద్దు ప్రాంతం తమిళనాడు రాష్ట్రం బరుగూరు సమీపంలోని జగనికొల్లె (ఆంధ్ర సరిహద్దుకు 4 కిలోమీటర్లు) వద్ద వృద్ధ దంపతులపై శుక్రవారం రాత్రి 5 ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో జీవమ్మ (63), గోవిందన్ (67) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను బరుగూరు ఆస్పత్రికి తరలించారు. జీవమ్మ మృతి చెందగా గోవిందన్ చికిత్స పొందుతున్నాడు.