బొల్లారం మున్సిపాలిటీలో అగ్ని ప్రమాదం

బొల్లారం మున్సిపాలిటీలో అగ్ని ప్రమాదం

SRD: ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలోని మైలాన్ రసాయన పరిశ్రమ నాలుగో అంతస్తులో మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో  అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అప్రమత్తమైన పరిశ్రమ యాజమాన్యం అగ్నిమాపక పరికరాలతో మంటలను వెంటనే అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సమయంలో కార్మికులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.