మండుటెండలో రాజన్న కోడెలు

మండుటెండలో రాజన్న కోడెలు

SRCL: ఎండ తీవ్రతతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే సదరు రాజన్న భక్తులు ఆలయ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌లు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ వేసవి నేపథ్యంలో ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.