శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

CTR: అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు ముగిసిన అనంతరం బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ, ప్రివిలేజ్ కమిటీ సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ వై.శివరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో శాసనమండలి సభ్యులు యొక్క ప్రోటోకాల్ విధి విధానాలు మీద కమిటీ సమావేశం నిర్వహించారు.