ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి.. కేసు నమోదు

ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి.. కేసు నమోదు

KRNL: ఆస్పరి మండలం బిణిగేరి గ్రామ సమీపంలో నాపరాళ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ కింద పడి మహేష్ బాబు (24) అనే యువకుడు అక్కడికక్కడే ఇవాళ మృతి చెందాడు. బనగానపల్లి మండలం ఎర్రగుడి గ్రామానికి చెందిన మహేష్ బాబు, డ్రైవర్ శేఖర్‌తో కలిసి ఆదోని మండలం పెద్దహరివాణంకు వెళ్తుండగా బిణిగేరి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.