పసుపు రైతులకు మేలు చేయడమే ధ్యేయం: కలెక్టర్

పసుపు రైతులకు మేలు చేయడమే ధ్యేయం: కలెక్టర్

NZB: జిల్లాలో పసుపు రైతులకు మేలు చేయడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. క్వింటాల్‌కు సగటున రూ.16,000 ధర లభిస్తోందని, గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశ్యంతోనే మార్కెట్ యార్డులో బహిరంగ వేలం విధానాన్ని అమలు చేశామని తెలిపారు. దీనిపై రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలని కోరారు.