గుర్తు తెలియని మృతదేహం లభ్యం
SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి తాళభద్ర రైల్వే గేట్ సమీపంలో శనివారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గమనించి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగ మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.