ఆయుష్ మాత్రే అజేయ శతకం
సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో CSK యువ ఆటగాడు ఆయుష్ మాత్రే మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. విదర్భతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన అతడు కేవలం 49 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయంగా 110 పరుగులు (53 బంతుల్లో) చేశాడు. దీంతో 193 పరుగుల లక్ష్యాన్ని ముంబై 17.5 ఓవర్లలోనే ఛేదించింది.