VIDEO: రాఘవాపురం గ్రామంలో హనుమాన్ జయంతి
SRPT: మోతే మండలం రాఘవాపురం గ్రామంలోని శ్రీరామాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇవాళ ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం, హనుమాన్ చాలీసా పఠనం భక్తిశ్రద్ధలతో సాగాయి. భక్తుల 'జై శ్రీరామ్' నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.