అక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాల కూల్చివేత

RR: చందానగర్ భవానిపురంలో పార్కు స్థలాన్ని ఆక్రమించారన్న స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను హైడ్రా బృందం కూల్చివేసింది. ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. పార్కును కాపాడినందుకు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు.