15 గొర్రె పిల్లలు మృతి.. రైతుకు భారీ నష్టం

KRNL: కర్నూలు మండలం జి. సింగవరంలో శుక్రవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ వంతెన వద్ద గొర్రెలను మేపుతున్న బైరిపెద్ద మద్దిలేటి జీవాలపై దాదాపు 6 కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఈ ఘటనతో రైతుకు రూ. 90 వేలకు పైగా నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.