'ట్రాక్టర్‌ని ఢీకొన్న లారీ'

'ట్రాక్టర్‌ని ఢీకొన్న లారీ'

SKLM: టెక్కలి మండలం లచ్చన్నపేట సమీప జాతీయ రహదారిపై సోమవారం ట్రాక్టర్‌ని లారీ ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు నందిగాం నుంచి టెక్కలి వైపు క్వారీకి వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సిగ్నల్ ఇవ్వకుండా ఒక్కసారిగా ఎడమ వైపు మళ్ళించారు. ఆ సమయంలో వెనకనుంచి వస్తున్న లారీ, ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. దీంతో వాహనం బోల్తా కొట్టింది.