రాజకీయాల్లో పెను సంచలనం ఎన్టీఆర్: ఎమ్మెల్యే
కోనసీమ: దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఘనత కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కుతుందని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. TDP ఆవిర్భావం దినోత్సవం ఆయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో తొలుత పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.