అపరాల పంటలపై రైతులకు అవగాహన సదస్సు
GNTR: ఫిరంగిపురం మండలం నుదురుపాడు, మేరికపూడి గ్రామాలలో శనివారం అపరాల పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. శనగ పంట కోత అనంతరం నిల్వ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల వ్యవసాయ అధికారి వాసంతి రైతులకు వివరించారు. రైతులు శనగ పంటను మద్దతు ధరకు విక్రయించే విధానం గురించి అవగాహన కల్పించారు.