హిందీ టీచర్ గుండెపోటుతో మృతి

హిందీ టీచర్ గుండెపోటుతో మృతి

కృష్ణా: కోడూరు శివారు స్వతంత్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలు మునిపల్ల పద్మజ (55) గుండెపోటుతో మృతి చెందారు. అవనిగడ్డకు చెందిన పద్మజకు శనివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆదివారం చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమా మహేశ్వరరావు తెలిపారు.