గురుకులం విద్యార్థులకు వైద్య పరీక్షలు

గురుకులం విద్యార్థులకు వైద్య పరీక్షలు

WGL: వర్ధన్నపేట పట్టణంలోని మైనార్టీ గురుకులం విద్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డాక్టర్ నేహా ఫాతిమా పర్యవేక్షణలో విద్యార్థులకు సోమవారం వైద్య పరీక్షలు చేశారు. బరువు, ఎత్తు, చాతి కొలతలతో పాటు రక్త పరీక్షలు, బీపీ, వినికిడి, దృష్టి లోపాలు తదితర పరీక్షలు నిర్వహించారు. పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్ వాషింగ్, రక్తహీనతపై అవగాహన కల్పించారు.