బేబీ మౌనికకు కొవ్వొత్తులతో ఘన నివాళి
BHPL: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ ఘటనలో మృతిచెందిన బేబీ మౌనిక ఆత్మకు శాంతి చేకూరాలని గురువారం చిట్యాల మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా, ఉద్యోగం ఇవ్వాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.