రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
KDP: ప్రొద్దుటూరు రోడ్డులో అండర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన ప్రమాదంలో భానుప్రకాష్ (24) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వ్యతిరేక దిశలో వచ్చిన పాల వ్యాను బైక్‌ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. గంగాప్రసాద్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.