'క్రమశిక్షణతో యాత్రను పూర్తి చేసుకుని రావాలి'

'క్రమశిక్షణతో యాత్రను పూర్తి చేసుకుని రావాలి'

హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సహకారంతో WGL హజ్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళ్లనున్న యాత్రికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA KR నాగరాజు హాజరై మాట్లాడారు. హజ్ యాత్ర ప్రతి ముస్లిం భక్తుడికి అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణమని తెలిపారు. క్రమశిక్షణతో యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోవాలన్నారు.