నేడు,రేపు డీలిమిటేషన్‌పై ఫిర్యాదుల స్వీకరణ
HYD: GHMC వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించిన ఫిర్యాదులను నేడు, రేపు స్వీకరించనున్నారు. శని, ఆదివారాలు సెలవు రోజులైనప్పటికీ ఫిర్యాదులను తీసుకోనున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు అందజేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది.