శ్రీరామచంద్రమూర్తికి శ్రీ పుష్ప యాగం
KKD: పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ కోదండ రామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం భాగంగా గురువారం శ్రీ పుష్ప యాగం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీ రామ మురళీకృష్ణ శ్రీనివాస్ రెడ్డి, మీనా, దంపతులు స్వామి వారికి పువ్వులు, పళ్ళు ,స్వీట్లు అందజేశారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికి తీర్ధప్రసాదాలు అందజేశారు.