మున్సిపల్ బరిలో అభ్యర్థులు ఎంతమందంటే..!
NRPT: కోస్గి మున్సిపాలిటీలోని 16 వార్డులకు గాను తుది జాబితాలో 51 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణలో 30 మంది రెబల్స్ తప్పుకోవడంతో పోటీ స్పష్టమైంది. కొన్ని వార్డుల్లో స్వతంత్రులు ప్రధాన పార్టీలకు గట్టి సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ విజయంపై ధీమా వ్యక్తం చేయగా, ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.