ఆదోని ప్రజలకు కమిషనర్ సూచన

KRNL: ఆదోనిలో బయట చెత్తాచెదారం వేస్తే జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ కృష్ణ ప్రజలను హెచ్చరించారు. సోమవారం పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. డస్ట్ బిన్లను ఉపయోగిస్తూ ఇళ్ల వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు చెత్తను ఇవ్వాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి రోగాలు ప్రబలుతున్నాయని అన్నారు.