నారాయణం పేటలో.. రెండు చోరీలు

NLR: సీతారాంపురం (M) నారాయణం పేటలో రెండు చోరీలు జరిగాయి. నారాయణం పేట ఎస్సీ కాలనీలో నివాసముంటున్న శీలం రామచంద్రయ్య, మల్లాపురం చెన్నకేశవులు ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి రూ. 67 వేలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పది రోజుల కిందట పనుల నిమిత్తం చెన్నైకి వెళ్లి తిరిగి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయని తెలిపారు.