రెండు రోజుల్లో టీచర్ పోస్ట్ ఎవరిదో క్లారిటీ

రెండు రోజుల్లో టీచర్ పోస్ట్ ఎవరిదో క్లారిటీ

కృష్ణా: డీఎస్సీ ఫలితాలు సోమవారం రాత్రి విడుదలై, అభ్యర్థుల స్కోర్‌కార్డులు వారి లాగిన్‌లలో అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ మార్కులు సాధించిన వారు ఉపాధ్యాయ ఉద్యోగం ఖాయం అన్న ఆనందంలో మునిగిపోయారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,208 ఖాళీలు ఉండగా, 67,470 మంది పరీక్ష రాశారు. ఎవరికెంత మార్కులు, ఎవరికి పోస్టు అన్నది మంగళ, బుధవారాల్లో స్పష్టం కానుంది.