సంతాప సభకు హాజరైన ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షరీఫ్ ఖాన్ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంలో ఆదివారం నిర్వహించిన సంతాప సభకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరై సంతాపం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి పార్టీ పటిష్టత కోసం షరీఫ్ ఖాన్ ఎంతో కృషి చేశారని వెల్లడించారు.